itemtype="https://schema.org/Blog" itemscope>

Sirula Nosage Song Lyrics

Sirula Nosage Song Lyrics


 

Sirula Nosage song is about the greatness of Sai Baba and his teachings. It describes how Sai Baba can help us overcome our problems and achieve our goals. Let the echoes of “Sirula Nosage” resonate within you, allowing them to stir your emotions, awaken your senses, and inspire you to see the world with a renewed perspective.

Sirula Nosage Song lyrics in Telugu and given below. May this beautiful song continue to be a source of comfort, inspiration, and a reminder of the profound beauty that exists in every note, every word, and every moment.

Sirula Nosage Song Lyrics in Telugu

సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా

సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా

పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ

పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ

సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా

షిర్డీ గ్రామంలో ఒక బాలుని రూపంలో

వేప చెట్టు కిందా వేదాంతిగ కనిపించాడు

తన వెలుగును ప్రసరించాడు

పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనం

పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనం

ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురు పీఠం

ఎండకు వానకు కొండకూ ఈ చెట్టు నీడనే వుండకూ

సాయి యి యి సాయి యి యి

సాయిరాం మసీదుకి రా అని మహల్సాపతి పిలుపుకు

మసీదుకి మారెను సాయి అదే అయినది ద్వారకమాయి

అక్కడ అందరు భాయి భాయి బాబా బోధల నిలయమదోయి

సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా

ఖురాను బైబిలు గీతా ఒకటని కులమ బేధం వద్దనీ

గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే

రాతి గుండెలను గుడులని చేసే నీటి దీపముల వెలిగించే

పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి

దిండీ వనముని పెంచీ మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే

కప్పకు పాముకు స్నేహం కలిపే బల్లి భాషకు అర్థం తెలిపే

ఆర్థుల రోగాలను హరియించే భక్తుల భాధలు తాను భరించే

ప్రేమ సహనం రెండు వైపులా వున్ననాడె గురుదక్షిణ అడిగే

మరణం జీవికి మార్పుని తెలిపే మరణించీ తాను మరలా బ్రతికే

సాయిరాం సాయిరాం ||4

నీదని నాదని అనుకోవద్దని, ధునిలో ఊదిని భూతిగనిచ్చే

భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఊత్సవమై సాగగా

కంకణ హారతులందుకొని కలి పాపాలను కడుగగా

సకల దేవతా స్వరూపుడై, వేద శాస్త్రములకతీతుడై

సద్గురువై జగద్గురువై

సత్యం చాటె దత్తాత్రేయుడవై భక్తుని ప్రాణం రక్షించుటకై

జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయి త్రుటిలోన పగులగా

ఆ ఆ ఆ ఆ

పరిపూర్ణుడై గురుపూర్ణిమై

భక్తుల మనసున చిరంజీవివై

శరీర సీమోల్లంఘణ చేసి దేహము విడిచెను సాయి

ఆ ఆ సమాధి అయ్యెను సాయి

సాయిరాం సాయిరాం||6

అఖిలాండకోటి బ్రహ్మండనాయక

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

 

 

Sirula Nosage Song Information

Song NameSirula Nosage Song
Film/AlbumDevullu
SingerSwarnalatha, Sujatha
Lyrics ByJonnavittla Ramalingeswara Rao
ComposerVandemataram Srinivas

 

Sirula Nosage Song Music Video

Leave a Comment